ఏపీ కేబినెట్‌ భేటీ ప్రారంభం..

5 Nov, 2020 11:17 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభమయ్యింది. 30 అంశాలపై కేబినెట్‌ చర్చించనుంది. చిరు వ్యాపారులకిచ్చే ‘జగనన్న చేదోడు’ పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. ఉచిత నాణ్యమైన బియ్యం డోర్‌ డెలివరీపై కేబినెట్‌ సబ్‌కమిటీ నివేదిక, ఇసుక పాలసీలో మార్పులపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. కొత్త ఇసుక విధానంపై ప్రభుత్వం ఇప్పటికే ప్రజాభిప్రాయం సేకరించింది. రాష్ట్రంలో భూముల రీసర్వేపై చర్చించడంతో పాటు విజయనగరం జిల్లా గాజులరేగలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు 80 ఎకరాల కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. పాడేరు మెడికల్‌ కాలేజీకి 35 ఎకరాల భూమి కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదించనుంది. మచిలీపట్నం పోర్టు డీపీఆర్‌పై చర్చించే అవకాశం ఉంది. శాసన సభ సమావేశాల తేదీలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది (చదవండి: ఇక కోరినంత ఇసుక!)

మరిన్ని వార్తలు