ఏపీ పోలీసు సమయస్ఫూర్తి. కెనాల్‌లో కొట్టుకుపోతున్న నలుగురిని..

30 Nov, 2021 16:30 IST|Sakshi

సాక్షి, గుంటురు: ఏపీ పోలీసు అధికారి సమయస్ఫూర్తితో వ్యవహరించి నలుగురు వ్యక్తుల ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది. ఈ అరుదైన సంఘటన గుంటూరులో చోటు చేసుకుంది. కాగా, అడిగొప్పలా గ్రామపరిధిలో నాగార్జున సాగార్‌ కెనాల్‌ ఉంది. కెనాల్‌ను చూడటానికి నలుగురు వ్యక్తులు ఈనెల (నవంబరు28) వెళ్లారు. ఆతర్వాత  ప్రమాదవశాత్తు వారంతా.. కెనాల్‌లో పడిపోయారు.

ఈక్రమంలో.. కొంతదూరం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. అయితే, బాధితులు సహాయం కోసం గట్టిగా  అరవడాన్ని ఒడ్డున ఉన్న ప్రవీణ్‌ కుమార్‌ అనే వ్యక్తి విన్నాడు. అతను స్థానిక దుర్గి పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ప్రవీణ్‌కుమార్‌ వెంటనే స్పందించి.. అక్కడి వారి సహయంతో బట్టలను ఒక తాడులాగా చేశాడు.

ఆతర్వాత.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వారివైపు విసిరాడు. వారు.. ఆ తాడును పట్టుకుని ఒడ్డుకు చేరుకుని వారి ప్రాణాలకు కాపాడుకున్నారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్‌ ప్రవీణ్‌కుమార్‌ చూపిన సమయస్ఫూర్తిని అక్కడివారు అభినందించారు. ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కూడా కానిస్టేబుల్‌ను ప్రత్యేకంగా అభినందించారు.  ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘హ్యట్సాఫ్‌ సర్‌..’, ‘మీ సమయస్ఫూర్తికి సెల్యూట్‌..’ అంటూ కామెంట్‌లు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు