ఏపీ సీఎస్‌గా సమీర్‌శర్మ పదవీ కాలం పొడిగింపు

28 Nov, 2021 18:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సమీర్‌శర్మ పదవీకాలం పొడిగిస్తూ తాజాగా కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది.  సమీర్‌శర్మను మరో 6 నెలలు పాటు ఏపీ సీఎస్‌గా కొనసాగించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. వచ్చే ఏడాది మే నెల వరకు ఆయన సీఎస్‌గా పనిచేయనున్నారు. కాగా, సమీర్‌శర్మ పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం ఈనెల 2వ తేదీన కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది.

చదవండి:  ప్లేట్‌లెట్‌ థెరపీ కిట్‌కు పేటెంట్‌.. రెండు తెలుగు రాష్టాల్లో ఇదే తొలిసారి

పొడిగింపు ప్రతిపాదనను ఆమోదిస్తూ సంబంధిత ఉత్తర్వులను జారీచేసింది. కాగా, రెండు నెలల క్రితం ఏపీకి సీఎస్‌గా సమీర్‌శర్మ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఈనెల 30న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే తాజా పొడిగింపుతో సమీర్‌శర్మ మరో ఆరునెలలు ఏపీకి చీఫ్‌ సెక్రెటరీగా సేవలందించనున్నారు. 

మరిన్ని వార్తలు