ఈ ఏడాది నుంచే ఫిషరీష్‌ వర్సిటీలో తరగతులు

25 Jan, 2022 14:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): నరసాపురంలో త్వరలో ఏర్పాటు కానున్న ఫిషరీస్‌ యూనివర్సిటీ భవన నిర్మాణాలు పూర్తిచేయడానికి ఏడాది సమయం పట్టే అవకాశం ఉండడంతో.. ఆ లోపుగా.. రాబోయే విద్యాసంవత్సరం (2022–2023) నుంచే ఆయా కోర్సుల తరగతులు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తాత్కాలిక అద్దె భవనాల పరిశీలన కోసం నరసాపురం ఫిషరీష్‌ యూనివర్సిటీ ప్రత్యేక అధికారి ఓ.సుధాకర్‌ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సోమవారం నరసాపురంలో పర్యటించింది. పట్టణంలోని పీచుపాలెం, పాతనవరసపురం ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న రెండు ఇంజనీరింగ్‌ కళాశాలలను ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుతో కలిసి పరిశీలించారు.  

రూ.100 కోట్లతో టెండర్లు..
భవనాల పరిశీలన అనంతరం ఎమ్మెల్యే ప్రసాదరాజు తన నివాసంలో అధికారుల బృందంతో సమావేశం నిర్వహించారు. వర్సిటీ కోసం ముందుగా మంజూరైన రూ.100 కోట్లతో అకడమిక్‌ బ్లాక్, అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్, బాయ్స్, గరల్స్‌ హాస్టల్‌ బ్లాకులను సరిపల్లిలో నిర్మించాల్సి ఉందన్నారు. అన్ని అనుమతులు మంజూరైన దృష్ట్యా వెంటనే టెండర్లు పిలవాలని అధికారులకు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిదిగా, దేశంలో మూడోదిగా నిర్మితమవుతున్న ఫిషరీస్‌ యూనివర్సిటీ దేశానికే తలమానికంగా నిలవాలన్నారు. (చదవండి: తొలి ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ముందడుగు)

మరిన్ని వార్తలు