తాడేపల్లిలో U1 రిజర్వ్‌ జోన్‌ను ఎత్తివేస్తూ ప్రభుత్వ నిర్ణయం​

28 Aug, 2022 19:23 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల పక్షపాతి అని గుంటూరు జిల్లా తాడేపల్లి, కొలనుకొండ, కుంచపల్లి రైతులన్నారు. తాడేపల్లిలో U1 రిజర్వ్‌ జోన్‌ను ఎత్తివేస్తూ ప్రభుత్వం డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ రైతులు ర్యాలీ చేపట్టారు.

తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ నుంచి వైఎస్సార్‌ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ విషయంపై గత ప్రభుత్వానికి ఎన్నో సార్లు అభ్యంతరాలు తెలియజేసినా బేఖాతరు చేసిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక U1 రిజర్వ్‌ జోన్‌ను ఎత్తివేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేయడంపై రైతుల హర్షం వ్యక్తం చేశారు.

చదవండి: (ఎలాంటి ఆంక్షలు లేవు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే: మల్లాది విష్ణు)

మరిన్ని వార్తలు