గతం కన్నా మిన్నగా.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు

10 Oct, 2021 03:25 IST|Sakshi

సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద పేదల ఇళ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నిబంధనలను అనుసరిస్తోందని, నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌(ఎన్‌బీసీ), ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఎన్‌బీసీ నిబంధనలతో పోలిస్తే ఎక్కువ విస్తీర్ణంలోనే ఇళ్లను కడుతోందని వారు పేర్కొంటున్నారు. అలాగే  గతంలో ప్రభుత్వాలు నిర్మించిన దాని కన్నా ఎక్కువ విస్తీర్ణంలోనే ఇళ్ల నిర్మాణం చేపడుతోందని గణాంకాలు చెబుతున్నాయి. అన్ని వసతులు ఉన్న పట్టణాల్లోని కాలనీల్లో 435.56 చదరపు అడుగుల స్థలంలో, గ్రామాల్లో 653.34 చదరపు అడుగుల స్థలంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తోంది. ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న లబ్ధిదారులను న్యాయస్థానం తీర్పు ఎంతో నిరాశపరిచింది. 

ఎన్‌బీసీ నిబంధనలతో పోలిస్తే..
ఎన్‌బీసీ నిబంధనల ప్రకారం ఇంటిలో పడక గది, హాల్‌ విస్తీర్ణం 167 చ.అ ఉండాలి. ప్రస్తుతం ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లలో ఆ విస్తీర్ణం 169.54 చ.అ ఉంటోంది. అంటే పడక గది విస్తీర్ణం 97 చదరపు అడుగులకు గాను 97.07 చ.అడుగుల లోనూ, హాల్‌ విస్తీర్ణం 70 చ.అ గాను 72.47 చ.అడుగుల విస్తీర్ణంలోను ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోంది. అదే విధంగా వంట గది 35.5 చ.అ లకు గాను 35.75 చ.అ ల్లో నిర్మిస్తున్నారు. బాత్‌రూమ్‌ విస్తీర్ణం 19.4  చ.అ లకు గాను 20.52 చ.అ ఉండేలా ఇళ్లకు ప్రణాళికను రూపొందించారని అధికారులు వివరించారు.

గతంతో పోలిస్తే..
కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల ప్లింత్‌ ఏరియా 215 చదరపు అడుగులు, కార్పెట్‌ ఏరియా 144 చదరపు అడుగులుగా ఉండేది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన  ఎన్టీఆర్‌ రూరల్‌ ఇళ్ల ప్లింత్‌ ఏరియా 224 చ.అ, కార్పెట్‌ ఏరియా 180 చ.అవిస్తీర్ణం. ప్రస్తుతం ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మిస్తున్న ఇళ్ల ప్లింత్‌ ఏరియా 340చ.అ, కార్పెట్‌ ఏరియా 218.65 చ.అ విస్తీర్ణం ఉంటోంది. (సాధారణంగా కార్పెట్‌ ఏరియా అంటే గోడలు కాకుండా ఇంటిలో ఉపయోగించే స్థలాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అదే గోడలు కలుపుకొని ఇంట్లోని మొత్తం స్థలాన్ని ప్లింత్‌ ఏరియాగా పరిగణిస్తారు. 

>
మరిన్ని వార్తలు