ఏపీ ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలు

3 Aug, 2021 03:11 IST|Sakshi

ఈ నెలాఖరుకల్లా 3,390 మంది ఎంఎల్‌హెచ్‌పీల నియామకం

సీఎం జగన్‌ ఆదేశాల మేరకు చర్యలు   

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. ఇప్పటికే 2,900 మంది మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌(ఎంఎల్‌హెచ్‌పీలు)ను నియమించిన ప్రభుత్వం.. ఈ నెలాఖరుకల్లా మరో 3,390 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతోంది. డిసెంబర్‌ చివరికి వైద్య, ఆరోగ్య శాఖలో వివిధ విభాగాలకు చెందిన 6 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనుంది. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ఈ చర్యలు చేపట్టింది.

ఎంఎల్‌హెచ్‌పీల నియామకం కోసం ఆర్థిక శాఖకు లేఖ రాసింది. దీనికి ఆర్థిక శాఖ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నెలలోనే అన్ని జిల్లాల్లో నోటిఫికేషన్‌లిచ్చి 3,390 మంది ఎంఎల్‌హెచ్‌పీలను నియమించనున్నారు. ఆగస్ట్‌ చివరి నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేసి ఎంఎల్‌హెచ్‌పీల ద్వారా సేవలందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లో బీఎస్సీ నర్సింగ్‌ అర్హత ఉన్న ఒక ఎంఎల్‌హెచ్‌పీతో పాటు ఒక ఏఎన్‌ఎం ఉంటారు. ఈ క్లినిక్‌లలో 12 రకాల సేవలు.. 65 రకాల మందులు, 14 రకాల నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు