పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేశాం..

1 Jul, 2021 02:48 IST|Sakshi

హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: కోవిడ్‌ తీవ్రత దృష్ట్యా పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) చింతల సుమన్‌ బుధవారం హైకోర్టుకు నివేదించారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఈ పరీక్షల రద్దు కోసం దాఖలైన వ్యాజ్యాన్ని మూసివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు