‘అమూల్‌’ ఒప్పందంతో మీకేంటి నష్టం?

22 Oct, 2021 04:25 IST|Sakshi

రఘురామపై ధర్మాసనం ప్రశ్నల వర్షం 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవలప్‌ మెంట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీడీ డీసీఎఫ్‌) ఆస్తులను గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌కు లీజుకిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీకొచ్చిన ఇబ్బంది ఏమిటని హైకోర్టు గురువారం ఎంపీ రఘురామకృష్ణరాజును ప్రశ్నించింది. అమూల్‌ విషయంలో ప్రభుత్వ నిర్ణయం వల్ల మీరే విధంగా నష్టపోతారని నిలదీసింది. ఫలానా విధంగానే ప్రభుత్వం వ్యవహరించాలని ఎలా శాసిస్తారని ప్రశ్నించింది.

ఈ వ్యవహారంలో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని తెలి పింది. తదుపరి విచారణను నవంబర్‌ 29కి వాయిదా వేసింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులను అప్పటివరకు పొడిగించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.  

మరిన్ని వార్తలు