ఎంసెట్‌ ఇక ఈఏపీసెట్‌

20 Jun, 2021 03:35 IST|Sakshi

ఆగస్టు 19 నుంచి 25 వరకు ఏపీ ఈఏపీసెట్‌–2021

జూన్‌ 24న నోటిఫికేషన్‌ మంత్రి సురేష్‌ వెల్లడి

సాక్షి, అమరావతి: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సహా పలు ప్రొఫెషనల్‌ యూజీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శనివారం ప్రకటించారు. ఇంజినీరింగ్‌ తదితర కోర్సులకు ఇంతకు ముందు ఏపీ ఎంసెట్‌ నిర్వహించేవారు. మెడికల్‌ కోర్సుల ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ‘నీట్‌’ నిర్వహిస్తుండటంతో మెడికల్‌ విభాగాన్ని ఎంసెట్‌ నుంచి మినహాయిం చారు. మెడికల్‌ను తొలగించినందున ఏపీ ఎంసెట్‌ ను ఏపీ ఈఏపీసెట్‌(ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌)–2021 పేరుతో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను ఆగస్టు 19 నుం చి 25 వరకూ నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఈ నెల 24న నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. 


సెప్టెంబర్‌ మొదటి, రెండో వారాల్లో ఇతర ప్రవేశ పరీక్షలు..
ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్‌ ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్‌ మొదటి, రెండో వారాల్లో నిర్వహించే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.  

ఏపీ ఈఏపీసెట్‌–2021 షెడ్యూల్‌..
అపరాధ రుసుము లేకుండా జూన్‌ 26 నుంచి జూలై 25వ తేదీ వరకు
రూ.500 ఫైన్‌తో జూలై 26 నుంచి ఆగస్టు 5 వరకు
రూ.1,000 లేట్‌ ఫీజుతో ఆగస్టు 6 నుంచి 10 వరకు
రూ.5,000 లేట్‌ ఫీజుతో ఆగస్టు 11 నుంచి 15 వరకు
రూ.10 వేల అపరాధ రుసుముతో ఆగస్టు 16 నుంచి 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి తెలిపారు.  

మరిన్ని వార్తలు