ఆర్నెల్లలో డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు.. 3 మాత్రమే

15 Oct, 2020 20:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సుప్రీంకోర్టు కమిటీకి రవాణా శాఖ నివేదిక

రాత్రి 8 గంటల తర్వాత మద్యం దొరక్కపోవడమే ప్రధాన కారణం

డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారు 3,829 మంది

అతి వేగంతో వెళుతున్న 5,888 మందిపై కేసులు

హెల్మెట్‌ లేని 11,686 మంది.. సీటు బెల్టు ధరించని 1,547 మందిపై కేసులు

సాక్షి, అమరావతి: గత ఆర్నెల్లలో రాష్ట్రంలో డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు కేవలం మూడు మాత్రమే నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు రాష్ట్రంలో రహదారి భద్రత ఉల్లంఘనలపై రవాణా శాఖ రోడ్డు సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీకి తాజాగా నివేదిక పంపింది. మద్య నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోనే డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు తగ్గిపోయాయని సుప్రీంకోర్టు కమిటీకి నివేదించింది.

టోల్‌గేట్లలో బ్రీత్‌ ఎనలైజర్లతో తనిఖీలను రవాణా శాఖ ముమ్మరం చేయడంతో కేసులు తగ్గిపోయాయి. ఈ మూడు కేసులు గుంటూరు జిల్లాలో రెండు, కృష్ణా జిల్లాలో ఒకటి నమోదయ్యాయి. గతేడాది ఇదే ఆర్నెల్ల వ్యవధిలో 2 వేలకు పైగా డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు కాగా, ఈ దఫా సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం. రాత్రి 8 గంటల తర్వాత మద్యం అమ్మకాలు లేకపోవడం, ఎక్కడా మద్యం దొరక్కపోవడం ప్రధాన కారణాలుగా రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. (చదవండి: రూ.8,000 కోట్లతో ‘ఉపాధి’)

సుప్రీంకోర్టు కమిటీకి పంపిన నివేదికలో ప్రధానాంశాలివే...

  • ఆర్నెల్ల వ్యవధిలో డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా వాహనాలు నడిపిన 3,829 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో రెండో దఫా పట్టుబడితే జైలుకు పంపనున్నారు.
     
  • అతి వేగంతో వెళుతున్న 5,888 మందిపై కేసులు నమోదయ్యాయి. హైవేలపై స్పీడ్‌ గన్లతో తనఖీలు ముమ్మరం చేశారు. 
     
  • హెల్మెట్‌ లేకుండా బండి నడుపుతూ 11,686 మంది పట్టుబడ్డారు. కౌన్సిలింగ్‌తో పాటు చలాన్లు విధించారు.
     
  • ఓవర్‌ లోడ్‌తో వెళ్లే 5,690 గూడ్స్‌ వాహనాలపై కేసులు నమోదయ్యాయి. ఓవర్‌ లోడ్‌తో వెళ్లే 511 ప్రయాణికుల వాహనాలపై కేసులు పెట్టారు. గూడ్స్‌ వాహనాల్లో ప్రయాణికుల్ని తరలిస్తున్న 91 వాహనాల్ని సీజ్‌ చేశారు. 
     
  • ఆర్నెల్ల వ్యవధిలో రోడ్డు ప్రమాద మరణాలు గతం కంటే తగ్గిపోయాయి. గతేడాది ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్య రోడ్డు ప్రమాద మరణాలు 4 వేల వరకు ఉంటే ఈ ఏడాది 2 వేలకు పైగా నమోదయ్యాయి.

రాష్ట్రంలో గత ఆర్నెల్లలో ట్రాఫిక్‌ ఉల్లంఘనలివే...


        జిల్లా                                డ్రంకన్‌ డ్రైవ్‌           అతి వేగం                   డ్రైవింగ్‌ లైసెన్సు లేని

అనంతపురం 0 320 327
చిత్తూరు  0 8 269
తూర్పుగోదావరి 0 30 289
గుంటూరు 2 1 459
కృష్ణా   1 1 101
కర్నూలు 0 147 330
నెల్లూరు 0 1,926 603
ప్రకాశం 0 2 146
శ్రీకాకుళం 0 0 8
విశాఖపట్నం  0 3,446             302
విజయనగరం 0 0  42
పశ్చిమగోదావరి 0            7       722
వైఎస్సార్‌ కడప  0  0   231
మొత్తం  5,888         3,829


 

మరిన్ని వార్తలు