వివాదంలో మంగళగిరి టీడీపీ కార్యాలయం! డబ్బులు ఎగ్గొట్టడంతో కోర్టుకు..

14 Jul, 2022 20:25 IST|Sakshi

సాక్షి, మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వివాదంలో చిక్కుకుంది. పార్టీ కార్యాలయం నిర్మించిన కాంట్రాక్టర్‌కు డబ్బులు ఎగ్గొట్టింది పార్టీ. దీంతో వ్యవహారం కోర్టుకు చేరింది.

పార్టీ కార్యాలయం నిర్మాణ బాధ్యతల్ని ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అప్పగించింది టీడీపీ. ప్రెకా సొల్యూషన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సబ్‌ కాంట్రాక్టు ఇచ్చింది ఎస్‌ఆర్‌ఆర్‌ కంపెనీ. రూ. 21 కోట్లతో మంగళగిరిలో టీడీపీ కార్యాలయాన్ని నిర్మించింది ప్రెకా సొల్యూషన్‌. నిర్మాణ బిల్లులను చెల్లిస్తామని ప్రెకా సొల్యూషన్‌కు చెప్పిన టీడీపీ.. బిల్లు చెల్లింపుల్లో ఎస్‌ఆర్‌ఆర్‌ లిమిటెడ్‌కు సంబంధం లేదని తేల్చేసింది.

అయితే బిల్లులు చెల్లించాలని ప్రెకా సొల్యూషన్‌ అడిగినా పట్టించుకోలేదు టీడీపీ. దీంతో ప్రెకా సొల్యూషన్స్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీతో పాటు ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టు లిమిటెడ్‌కు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. అయితే కోర్టు నోటీసులు ఇచ్చినా జాప్యం చేయడంతో ఆర్బిటర్‌ పిటిషన్‌ దాఖలు చేసింది ప్రెకా. వివాద పరిష్కారానికి రిటైర్డ్‌ జస్టిస్‌ స్వరూప్‌రెడ్డిని నియమించింది తెలంగాణ హైకోర్టు.

మరిన్ని వార్తలు