AP: రానున్న మూడు రోజుల వాతావరణ ఇలా ఉండనుంది

21 May, 2021 18:12 IST|Sakshi

సాక్షి, అమరావతి:  నైరుతి రుతుపవనాలు శుక్రవారం నాడు సౌత్ బంగాళాఖాతం కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులు, మొత్తం దక్షిణ అండమాన్ సముద్రం, ఉత్తర అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలలో ప్రవేశించాయి. రానున్న 48 గంటలలో  నైరుతి బంగాళాఖాతము మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, మొత్తం అండమాన్ సముద్రం, అండమాన్ దీవులు, ఈస్ట్‌సెంట్రల్ కొన్ని ప్రాంతాలలో రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

ఆగ్నేయ బంగాళాఖాతం దానిని అనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో 3.1కి.మి & 5.8 కి.మిలో మధ్య కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం వలన తూర్పు మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతాలలో సుమారుగా 22వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది 24వ తేదీకి బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది వాయువ్య దిశగా ప్రయాణించి సుమారుగా 26వ తేదీ ఉదయాన ఒడిశా-పశ్చిమబెంగాల్ తీరానికి  చేరుకుంటుంది.   
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన : 
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం :
►ఈరోజు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు  తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉండగా, భారీ నుంచి అతిభారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు  తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది . అలాగే భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
►ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (30-40 కిలోమీటర్లు గంటకు )తో పాటు  తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.  గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది.

 దక్షిణ కోస్తా ఆంధ్ర :
►ఈరోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (30-40 కిలోమీటర్లు గంటకు )తో పాటు  తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
►రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (30-40 కిలోమీటర్లు గంటకు )తో పాటు  తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.  భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
►ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (30-40 కిలోమీటర్లు గంటకు)తో పాటు  తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది.
             
రాయలసీమ:
►ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (30-40 కిలోమీటర్లు గంటకు)తో పాటు  తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
►రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (30-40 కిలోమీటర్లు గంటకు )తో పాటు  తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
►ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.  ఈ వివరాలను భారత వాతావరణ శాఖ తెలిపింది.
 

చదవండి: INS Rajput: ‘రాజ్‌పుత్‌’కు వీడ్కోలు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు