ఏపీలో కొత్తగా 3,841 కరోనా కేసులు..

1 Jul, 2021 17:38 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో  90,574  మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా  3,841 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 38 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,744 కు చేరింది.

గడిచిన 24 గంటల్లో 3,963 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 18 లక్షల 42 వేల 432 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 38,178 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,20,84,192  కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

చదవండి: ఫుడ్‌ డెలివరీ చేసేందుకు వెళ్లి.. మహిళా డాక్టర్‌పై లైంగికదాడి

మరిన్ని వార్తలు