ఏపీ: కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ రాత పరీక్ష కీ విడుదల.. అభ్యంతరాలకు లాస్ట్‌ డేట్‌ ఇదే

22 Jan, 2023 20:11 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ(ఆదివారం) జరిగిన పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు 91 శాతం అభ్యర్ధులు హాజరైనట్లు రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెల్లడించింది. అలాగే కీని సైతం రిలీజ్‌ చేసేసింది. మొత్తం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్‌ చేయగా.. 5,03,487 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఆదివారం ప్రిలిమినరీ ఎగ్జామ్‌ ప్రశాంతంగా ముగిసింది.  

పరీక్షకు 4,58,219 మంది హాజరు కాగా, 45,268 మంది గైర్హాజరు అయ్యారు. ఇక ముందుగా చెప్పిన టైంకి slprb.ap.gov.in వెబ్‌సైట్ లో ప్రిలిమినరీ ఆన్సర్ కీ అప్ లోడ్ చేశారు అధికారులు. జనవరి 25వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ప్రిలిమినరీ ఆన్సర్ కీ పై అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పిస్తారు. అభ్యంతరాలను తెలిపేందుకు  id mail-slprb@ap.gov.in మెయిల్ ఐడీ కేటాయించింది రిక్రూట్‌మెంట్‌ బోర్డు.

పూర్తి సమాచారం కోసం సాక్షి ఎడ్యుకేషన్‌ డాట్‌ కామ్‌ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు