ఈ-పాస్‌కు సంబంధించి ఏపీ పోలీస్‌ శాఖ కీలక సూచనలు

24 May, 2021 22:45 IST|Sakshi

సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పోలీస్ శాఖ ఈ-పాస్‌కు సంబంధించి కీలక సూచనలు చేసింది. ఈ-పాస్ లేకుంటే రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ల వద్ద సమస్య వస్తోందని, కనుక ఈ-పాస్ నిబంధనల ప్రకారం ప్రయాణాలను ప్లాన్‌ చేసుకోవాలిని సూచించింది. ఏపీలో ఉ.6 గంటల నుంచి మ.12 గంటల వరకు సడలింపు ఉంటుందని, మిగతా సమయాల్లో ఏపీకి రావాలనుకునే వారికి ఈ-పాస్ తప్పనిసరిని పోలీస్‌ శాఖ స్పష్టం చేసింది. అంబులెన్స్‌లు, అత్యవసర సేవలకు ఈ-పాస్ అవసరం లేదని తెలిపింది. దరఖాస్తు చేసిన గంట వ్యవధిలోనే ఈ-పాస్ మంజూరు చేయనున్నట్లు తెలిపింది. 

చదవండి: బ్లాక్‌ ఫంగస్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు