పోలీస్‌ డ్యూటీ మీట్‌లో సత్తా చాటిన ఏపీ పోలీసులు

22 Feb, 2023 05:56 IST|Sakshi
పోటీల విజేతలతో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి

ఆరు పతకాలతో దేశంలో మూడో స్థానం  

విజేతలను అభినందించిన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి 

సాక్షి, అమరావతి: అఖిల భారత డ్యూటీ మీట్‌లో రాష్ట్ర పోలీసులు సత్తా చాటారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు పోలీస్‌ డ్యూటీ మీట్‌ జరిపారు. పోలీస్‌ వృత్తి నైపుణ్యాలకు సంబంధించి మొత్తం 11 విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో 24 రాష్ట్రాల పోలీస్‌ విభాగాలు, కేంద్ర పోలీస్‌ బలగాలకు చెందిన మొత్తం రెండు వేల మంది పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర పోలీస్‌ అధికారులు రెండు స్వర్ణ పతకాలు, మూడు రజత పతకాలు, ఓ కాంస్య పతకంతో మొత్తం ఆరు పతకాలు గెలుచుకుని దేశంలో మూడో స్థానంలో నిలిచారు. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన రాష్ట్ర పోలీస్‌ అధికారులను డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి మంగళవారం అభినందించారు.

పోలీస్‌ శాఖ నుంచి స్వర్ణ పతక విజేతలకు రూ.3లక్షలు, రజత పతక విజేతలకు రూ.2లక్షలు, కాంస్య పతక విజేతకు రూ.లక్ష చొప్పున నగదు బహుమతులు అందించారు. 

మరిన్ని వార్తలు