-->

మూడు జిల్లాల కలెక్టర్లు బదిలీ 

3 Apr, 2024 06:25 IST|Sakshi

ఐదు జిల్లాల ఎస్పీలతో పాటు గుంటూరు రేంజ్‌ ఐజీ కూడా..

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు  

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పలువురు ఉన్నతాధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను, ఆరుగురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. వీరి స్థానంలో కొత్త అధికారులను నియమించేందుకు ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లు సూచిస్తూ వెంటనే జాబితా పంపించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డికి మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజాబాబు, అనంతపు­రం జిల్లా ఎన్నికల అధికారి గౌతమి, తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీశాతో పాటు ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్, పల్నాడు జిల్లా ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి, చిత్తూరు జిల్లా ఎస్పీ పి.జాషువా, అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్, గుంటూరు రేంజ్‌ ఐజీ పాలరాజును కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వీరికి ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని స్పష్టం చేసింది.

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers