AP: 25 నుంచి రాష్ట్రస్థాయి నాటక పోటీలు

22 Jun, 2022 15:00 IST|Sakshi

ఏపీ ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌

విజయవాడ కల్చరల్‌: రాష్ట్రంలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు తోరం రాజా చెప్పారు. ఈ నెల 25 నుంచి వారం రోజుల పాటు విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో వైఎస్సార్‌ కళాపరిషత్‌ ద్వారా రాష్ట్ర స్థాయి నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కనీసం 20 శాతం చిత్రీకరణ జరపాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు నిర్మాతలు, దర్శకులు సహకరించాలని కోరారు. 

ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా రాష్ట్రంలోని 24 క్రాఫ్ట్స్‌కు చెందిన వారికి గుర్తింపు కార్డులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రంగస్థల కళాకారిణి రాజేశ్వరి మాట్లాడుతూ.. కళాకారులకు బస్‌పాస్‌ రాయితీ ఇవ్వాలని కోరారు. సినిమాలను ఏపీలో కూడా చిత్రీకరించి.. స్థానిక కళాకారులకు అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆంధ్రా ఆర్ట్స్‌ అకాడమీ అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు, ఉపాధ్యక్షుడు సుఖమంచి కోటేశ్వరరావు, సభ్యులు కొప్పుల ఆనంద్, బొర్రా నరసయ్య పాల్గొన్నారు. (క్లిక్‌: త్యాగానికి బహుమతి.. పరిహారం మంజూరు)

మరిన్ని వార్తలు