రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌

1 Nov, 2023 12:57 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవత­రణ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. బుధవారం సీఎం క్యాంపు కార్యా­లయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి.. అనంతరం జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. ఆపై తెలుగు తల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం కోసం వెళ్లారు.

ఇదిలా ఉంటే.. రాష్ట్ర ఉత్సవంగా అవతరణ వేడుకలు ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో కలెక్టర్లు, ఎస్‌పీలు పాల్గొంటున్నారు. తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. మరోవైపు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
 

మరిన్ని వార్తలు