వ్యాక్సినేషన్‌ టాప్‌–5లో ఏపీ

19 Oct, 2021 05:12 IST|Sakshi

రాష్ట్రంలో 30.5% మందికి రెండు డోసులు

మొదటి స్థానంలో కేరళ

సాక్షి, అమరావతి: కోవిడ్‌ టీకా వేయడంలో మన రాష్ట్రం మరో ఘనతను దక్కించుకుంది. కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఉధృతంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దేశంలో ఇప్పటివరకు 20.3 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసినట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి. ఎక్కువమందికి టీకా వేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ టాప్‌–5లో నిలిచింది. కేరళ మొదటి స్థానంలో నిలిచింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 18–44 ఏళ్ల వయసు వారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నడుస్తోంది. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కులు 3.47 కోట్ల మంది ఉంటారని అంచనా. వీరిలో ఇప్పటికే 3 కోట్ల మందికి పైగా తొలి డోసు, 1.66 కోట్ల మందికి పైగా రెండు డోసులు వేశారు. అంతకుముందే హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, 45 ఏళ్లు నిండిన వారు, ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు టీకా వేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు