‘ఈ–సంజీవని’లో ఏపీ టాప్‌

22 Sep, 2021 04:36 IST|Sakshi

కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ టెలీ మెడిసిన్‌ సేవ ఈ–సంజీవనిలో ఆంధ్రప్రదేశ్‌ ముందు వరసలో ఉన్నట్లు కేంద్ర కుటుంబ,ఆరోగ్య సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ–సంజీవని సేవలకు సంబంధించి 1.2 కోట్ల సంప్రదింపులు పూర్తి కాగా ఆంధ్రప్రదేశ్‌..ఈ సంజీవని ఆయుష్మాన్‌ భారత్‌– హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ (ఏబీ–హెచ్‌డబ్ల్యూసీ), ఔట్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఓపీడీ) సేవలు కలిపి 37,04,258 సంప్రదింపులతో తొలిస్థానంలో నిలిచిందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఈ–సంజీవని ప్రారంభించిన తరువాత దీన్ని అమలు పరిచిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కావడం విశేషం. అనంతరం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 2 వేల హబ్‌లు, 28 వేల స్పోక్‌లను ఏర్పాటు చేసింది. ఏపీ తరువాత ఈ–సంజీవని అందించిన రాష్ట్రాల్లో కర్ణాటక (22,57,994), తమిళనాడు (15,62,156), ఉత్తరప్రదేశ్‌ (13,28,889), గుజరాత్‌ (4,60,326), మధ్యప్రదేశ్‌ (4,28,544), బిహార్‌ (4,04,345), మహారాష్ట్ర (3,78,912), పశ్చిమ బెంగాల్‌ (2,74,344), కేరళ (2,60,654) ఉన్నట్లు కేంద్రం పేర్కొంది.   

మరిన్ని వార్తలు