తిరుమల శ్రీవారి ఆలయంలో అర్చకుల నియామకం

25 Jun, 2021 21:48 IST|Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ అర్చకుల నియామకం చేపట్టింది. శ్రీవారి ఆలయంలో 2007 తర్వాత ఈ ఏడాది అర్చకుల నియామకం జరిగింది. మీరాశి వంశానికి చెందిన 8 మందికి శ్రీవారి కైంకర్యాలు చేసే అవకాశం టీటీడీ కల్పించింది. కాగా మీరాశి వంశీకుల్లో నూతన తరానికి శ్రీవారి ఆలయంలో అర్చకత్వం చేసే భాగ్యం లభించింది. ఈ క్రమంలో నేడు నియమితలైన 8 మంది అర్చకులు శ్రీవారికి పాదసేవ చేశారు. అనంతరం ఈ అదృష్టం కల్పించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వాళ్లు  కృతజ్ఞతలు తెలిపారు.

ప్రధాన అర్చకులు కృష్ణ శేషచల దీక్షితులు మాట్లాడుతూ.. శ్రీవారి అర్చకులకు మరపురాని రోజని అన్నారు. వంశపారంపర్యం కొనసాగిస్తూ మా పిల్లలకు కైంకర్యాలు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇందుకు కారణమైనా సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి,  టీటీడీ పాలకమండలికి ధన్యవాదాలు తెలిపారు. కాగా నేడు మూడు కుటుంబాల నుంచి 8 మంది అర్చకులు బాధ్యతలు చేపట్టారు. నూతన అర్చకులు అందరు కూడా రెగులరైజ్ ఉద్యోగులగా బాధ్యతలు చేపట్టారు.

చదవండి: టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ చైర్మన్‌గా జవహర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

మరిన్ని వార్తలు