AP: ఈ నెలలో రెండు తుపానులు!

5 Oct, 2021 03:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నేడు అక్కడక్కడా తేలికపాటి వానలు

సాక్షి, విశాఖపట్నం: లానినా (సముద్ర వాతావరణం) పరిస్థితులతో పాటు హిందూ మహాసముద్రం డైపోల్‌ (ద్విధ్రువ) వ్యతిరేక పరిస్థితులు కనిపిస్తుండటంతో బంగాళాఖాతంలో మరో రెండు తుపాన్లు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నెల 14 లేదా 15వ తేదీన ఒక తుపాను, 21 తర్వాత మరో తుపాను రానున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ తుపానులతో రాష్ట్రంలో సాధారణం కంటే అత్యధిక స్థాయిలో వర్షపాతం నమోదు కానుందని చెబుతున్నారు. ప్రస్తుతం దక్షిణ కోస్తా, రాయలసీమ మీదుగా ఈశాన్య గాలులు, ఉత్తరాంధ్ర మీదుగా వాయువ్య గాలులు వీస్తున్నాయి.

వీటి ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడచిన 24 గంటల్లో ఈశాన్య గాలుల ప్రభావంతో కామవరపుకోటలో 69.5 మిల్లీమీటర్లు, విజయవాడ, మంగళగిరిలో 56.3, అనంతగిరిలో 56, సత్తెనపల్లిలో 54, గుంతకల్లులో 49.5, అద్దంకిలో 47.5, గొలుగొండలో 44.5, జి.కొండూరులో 43.8, విస్సన్నపేటలో 42, నల్లజర్లలో 40.5, కొయ్యూరులో 38.7 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.  

చదవండి: ఆర్బీకేలు అద్భుతం.. కళ్లారా చూశా.. చాలా బాగున్నాయ్‌

మరిన్ని వార్తలు