మూడు రాజ‌ధానులు: బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ప్ర‌శంస‌లు

31 Jul, 2020 18:58 IST|Sakshi

సాక్షి, అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు రాజ‌ధానుల కోసం ప్ర‌వేశ‌పెట్టిన బిల్లును గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్‌ శుక్ర‌వారం ఆమోదించిన విష‌యం తెలిసిందే. ఈ నిర్ణ‌యాన్ని తెలుగు రాష్ట్రాల‌ బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రూ ప్లెమింగ్ స్వాగ‌తిస్తూ గొప్ప ప‌రిణామంగా కొనియాడారు. ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ ద్వారా ఆ మూడు న‌గ‌రాలు సంక్షేమ సౌభాగ్యాల‌తో విరాజిల్లాల‌ని ఆకాంక్షించారు. శాస‌న‌ రాజ‌ధాని అమ‌రావ‌తి, ప‌రిపాల‌న‌ రాజ‌ధాని విశాఖ‌ప‌ట్నం, న్యాయ‌ రాజ‌ధాని క‌ర్నూలు న‌గ‌రాల‌ను సంద‌ర్శించేందుకు ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నాన‌ని తెలిపారు. అయితే ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా క‌రాళ నృత్యం త‌గ్గిన త‌ర్వాత త‌ప్ప‌కుండా వీటిని సంద‌ర్శించేందుకు ఏపీకి వ‌స్తానంటూ ట్వీట్ చేశారు. కాగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మూడు రాజ‌ధానుల బిల్లు ఎట్ట‌కేల‌కు ఆమోదం పొంద‌డంతో రాష్ట్ర‌వ్యాప్తంగా అనేక‌మంది సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. (మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోదం)

(వైజాగ్‌ని చాలా మిస్‌ అవుతున్నా..)

మరిన్ని వార్తలు