2 రోజులుగా కోవిడ్‌ కేసులు తగ్గాయి: ఏకే సింఘాల్‌ 

5 Jun, 2021 19:21 IST|Sakshi

సాక్షి, విజయవాడ : గత రెండ్రోజులుగా కోవిడ్ కేసులు తగ్గాయని, 12,247 మంది కోవిడ్ కేర్ సెంటర్‌లో ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. రాష్ట్రంలో 1460 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. డాక్టర్‌ భాస్కర్‌రావు వైద్యం కోసం కోటిన్నర వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని, ఆయన ట్రీట్‌మెంట్‌కు అయ్యే ఖర్చు మొత్తాన్ని.. సీఎం రిలీఫ్ ఫండ్‌ నుంచి ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. కోవిడ్ కష్టకాలంలో పనిచేస్తున్న వైద్యులకు అండగా ఉండాలని సీఎం భరోసా ఇచ్చారని, సీనియర్ రెసిడెంట్ వైద్యుల డిమాండ్లపై సీఎం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యుల స్టైఫండ్ ఇప్పటికే రూ.45 వేల నుంచి 70 వేలకు పెంచామని తెలిపారు. 2020 సెప్టెంబర్‌ నుంచి పెంచిన స్టైఫండ్ అమలు చేస్తామని అన్నారు. మూడో దశ కోవిడ్‌పై టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. 

మరిన్ని వార్తలు