14 మెడికల్‌ కాలేజీలు.. దేశంలోనే ప్రథమం: సింఘాల్‌

31 May, 2021 18:09 IST|Sakshi

ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నాయి

ఆక్సిజన్‌ వినియోగం తగ్గింది

కరోనా రాకుండానే బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారు 40మంది 

సాక్షి, విజయవాడ: ఒకే సారి 14 మెడికల్‌ కాలేజీలకు శంఖుస్థాపన చేయడం దేశంలో ఇదే ప్రథమం అని ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో విధించిన కర్ఫ్యూని జూన్‌ 10 వరకు పొడిగించాం. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు సడలింపులు యధావిధిగా ఉంటాయి’’ అన్నారు. 

‘‘రాష్ట్రంలో కోవిడ్ కేసులు బాగా తగ్గాయి. గడిచిన 24 గంటలలో 83, 461 శాంపిల్స్‌ పరీక్షించాం. 7,943 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 98 మంది కోవిడ్‌ బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐసీయూ బెడ్స్- 1,461, ఆక్సిజన్ బెడ్స్ 6,323 అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ కేర్ సెంటర్లో 15,106 వేల‌మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాల్లో రెమిడెసివర్ ఇంజక్షన్లు 1,75,000 డోసులు జిల్లాలలో అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు ఆక్సిజన్ 591 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ వినియోగించాం. గతంతో పోలిస్తే ఆక్సిజన్ వినియోగం కూడా బాగా తగ్గింది. 104 కాల్ సెంటర్ కి వచ్చే కాల్స్ సంఖ్య తగ్గింది’’ అన్నారు. 

‘‘రాష్డ్రంలో ఇప్పటి వరకు బ్లాక్ ఫంగస్ కేసులు1179 నమోదవ్వగా.. ఇందులో 14 మంది ఇప్పటివరకు మృతి చెందారు. 97 మంది ట్రీట్ మెంట్ పొంది కోలుకున్నారు. ఇక బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారిలో 1139 మందికి‌ కోవిడ్ వచ్చిన వారు ఉన్నారు. మరో 40 మందికి కరోనా రాకుండానే బ్లాక్‌ ఫంగస్‌ వచ్చింది. బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారిలో కోవిడ్ సమయంలో ఆక్సిజన్ ఉపయోగించిన వారు 370 అయితే ఆక్సిజన్ ఉపయోగించని వారు- 809 కాగా.. 687 మంది స్టెరాయిడ్స్ ఉపయోగిస్తే, 492 మంది స్డెరాయిడ్స్ ఉపయోగించలేదు. ఇక బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారిలో 743 మంది డయాబెటిస్ పేషేంట్స్ ఉన్నారు. బ్లాక్ ఫంగస్‌కి అవసరమైన మందులు కేంద్రం కేటాయిస్తోంది’’ అని తెలిపారు. 

‘‘ప్రైవేట్ ఆసుపత్రులలో 14,924 మంది కోవిడ్ బాధితులుంటే ...ఇందులో 8,902 మంది ఆరోగ్యశ్రీ లో చికిత్స పొందుతున్నారు. అన్ని ఆసుపత్రులలో‌ 78 శాతం ఆరోగ్యశ్రీలో ట్రీట్ మెంట్ పొందుతున్నారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 88 శాతం, విజయనగరంలో 81 శాతం ఆరోగ్యశ్రీలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే కేసులు తగ్గుతున్నాయి’’ అని సింఘాల్‌ తెలిపారు. 

ఇక్కడ చదవండి: 14 మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి సీఎం జగన్‌ శంకుస్థాపన

చదవండి: చిన్న పిల్లల్లో కోవిడ్‌ చికిత్స విధానానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

మరిన్ని వార్తలు