అన్ని జిల్లాల్లో వ్యాక్సిన్‌ సెకండ్ డోస్‌ కొనసాగుతోంది: సింఘాల్‌

14 May, 2021 18:12 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వ్యాక్సిన్‌ సెకండ్ డోస్‌ కొనసాగుతోందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. కోవిడ్ కేర్ సెంటర్లలో 16,597 మందికి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. జాంనగర్‌ నుంచి గుంటూరుకు 110 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుందని, జంషెడ్‌పూర్ ద్వారా 4 ట్యాంకర్లలో 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానున్నట్లు తెలిపారు. 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ అదనంగా రాబోతుందన్నారు. జిల్లాల వారీగా ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలతో ఫీవర్ కిట్‌లు అందిస్తామని, బెడ్స్‌ దొరకని పరిస్థితిలో కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించాలని సూచించినట్లు తెలిపారు.

చదవండి: ఏపీలో కొత్తగా 22,018 కరోనా కేసులు, 96 మరణాలు

మరిన్ని వార్తలు