ఏపీకి మరో 5 లక్షల కోవిషీల్డ్‌ డోసులు 

5 May, 2021 03:27 IST|Sakshi
పోలీస్‌ భద్రత మధ్య జిల్లాలకు తరలిస్తున్న వ్యాక్సిన్‌ డోసులు

గన్నవరం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరో 5 లక్షల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులు మంగళవారం చేరుకున్నాయి. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులను ఢిల్లీ నుంచి విమానంలో ఇక్కడికి తీసుకువచ్చారు. అనంతరం వాటిని గన్నవరంలోని రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనంలో భద్రపరిచారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు ఇక్కడి నుంచి 5 లక్షల డోసులను 13 జిల్లాలకూ రోడ్డు మార్గం ద్వారా తరలించినట్లు శీతలీకరణ అధికారి దేవానందం చెప్పారు. 

జిల్లాల వారీగా వ్యాక్సిన్‌ పంపిణీ ఇలా.. 
అనంతపురం–45 వేలు, చిత్తూరు–40 వేలు, తూర్పు గోదావరి–40 వేలు, గుంటూరు–40 వేలు, కృష్ణా–45 వేలు, కర్నూలు–40 వేలు, ప్రకాశం–35 వేలు, నెల్లూరు–38 వేలు, శ్రీకాకుళం–30 వేలు, విశాఖ–40 వేలు, విజయనగరం–30 వేలు, పశ్చిమ గోదావరి–37 వేలు, వైఎస్సార్‌ కడప–40 వేల టీకా డోసులు.  

మరిన్ని వార్తలు