ద‌ళిత సీఐని పబ్లిక్‌గా బెదిరించిన జేసీ

7 Aug, 2020 15:48 IST|Sakshi

జేసీపై మ‌రిన్ని కేసులు న‌మోదు చేసే అవ‌కాశం

సాక్షి, అనంతపురం: అక్ర‌మ వాహ‌నాల కేసులో అరెస్ట‌యిన‌ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు అస్మిత్ రెడ్డిలు గురువారం జైలు నుంచి విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇది జ‌రిగిన 24 గంట‌ల్లోపే వాళ్లిద్దరిపై మ‌రో కేసు న‌మోదైంది. జేసీ విడుద‌ల సంద‌ర్భంగా కడ‌ప సెంట్ర‌ల్ జైలు వ‌ద్ద ఆయ‌న‌ వ‌ర్గీయులు నానా హంగామా చేస్తూ కోవిడ్ నిబంధ‌న‌లు కాల‌రాశారు. దీంతో కోవిడ్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న కింద జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, అస్మిత్‌, ప‌వ‌న్‌కుమార్ స‌హా 31 మంది టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. మరోవైపు జేసీ, అస్మిత్‌లు క‌డ‌ప సెంట్ర‌ల్ జైలు నుంచి తాడిప‌త్రి వర‌కు అనుచ‌ర‌గ‌ణంతో ర్యాలీగా వ‌చ్చారు. (వాహనాల కుంభకోణం; జేసీ కొత్త నాటకం )

ఈ క్ర‌మంలో జేసీ ద‌ళిత సీఐ దేవేంద్ర‌ను ప‌బ్లిక్‌గా బెదిరించారు. దీంతో సీఐ ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించిన జేసీపై మ‌రిన్ని కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంది. కాగా కండీష‌న్ బెయిల్‌లో భాగంగా జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, అస్మిత్‌లు శుక్ర‌వారం అనంత‌పురం వ‌న్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వ‌చ్చి సంత‌కాలు చేశారు. ఈ సంద‌ర్భంగా సీఐతో దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డంపై జేసీని పోలీసులు విచారిస్తున్నారు. ఆయ‌న‌పై మ‌రో నాలుగు కేసులు న‌మోద‌య్యే అవ‌కాశాలున్నందున ఎలాంటి అవాంచ‌నీయ ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకోకుండా తాడిప‌త్రి ప‌రిస‌రాల్లో భారీగా పోలీసులు మెహ‌రించారు. (జేసీ వర్గీయుల హంగామా.. నిలిచిన 108 అంబులెన్సు)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు