పులిచింతల ప్రాజెక్ట్ వద్ద మరో వివాదం

1 Jul, 2021 18:44 IST|Sakshi

బ్యారేజ్ 10వ గేట్ వద్ద మకాం వేసి బారికేడ్లు పెట్టిన టీఎస్ పోలీసులు

సాక్షి, గుంటూరు: పులిచింతల ప్రాజెక్ట్ వద్ద మరో వివాదం నెలకొంది. బ్యారేజ్ 10వ గేట్ వద్ద మకాం వేసి టీఎస్ పోలీసులు బారికేడ్లు పెట్టారు. టీఎస్ పోలీసుల తీరును బ్యారేజ్ అధికారులు తప్పుపడుతున్నారు. బ్యారేజ్‌పై టీఎస్ పోలీసులకు ఎలాంటి హక్కు లేదని.. బ్యారేజ్ నిర్వహణ పూర్తి బాధ్యత ఏపీ ప్రభుత్వానిదేనని ఈఈ శ్యామ్ ప్రసాద్‌ అన్నారు.

‘‘ఎటువంటి హక్కు లేకుండా బ్యారేజ్‌ పైకి రావడం నిర్వహణకు ఇబ్బంది కలిగించడమే. వద్దన్నా వినకుండా బ్యారేజ్‌పై సీసీ కెమెరాలను టీఎస్ పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. బ్యారేజ్ నుంచి టీఎస్ పోలీసులను వెనక్కి పిలవాలని తెలంగాణ అధికారులను కోరాం. కృష్ణా డెల్టా అధికారులు కోరితేనే పులిచింతల నుంచి నీటిని విడుదల చేస్తాం. ఆ సమయంలోనే జల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలి.

జల విద్యుత్‌కు నీరు విడుదల చేయాలంటే 9.54 టీఎమ్‌సీల మినిమం డ్రా డౌన్ లెవల్ ఉండాలి. ప్రస్తుతం బ్యారేజ్‌లో 21.1 టీఎమ్‌సీల నీరు నిల్వ ఉంది. ప్రొటోకాల్ పాటించకుండా జలవిద్యుత్‌కు నీరు విడుదల చేసుకుంటున్నారు. తెలంగాణ అధికారుల చర్యలతో ఖరీఫ్‌లో కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి సమస్య వస్తుందని’’ ఈఈ శ్యామ్ ప్రసాద్‌ అన్నారు.

మరిన్ని వార్తలు