ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్

27 Jan, 2023 07:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని శివరామకృష్ణన్‌ కమిటీ ఇచ్చిన  నివేదికను అమలుచేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఏపీలో రాజధాని ఎలాంటి ప్రాంతంలో ఏర్పాటుచేయాలన్న అంశంపై కమిటీ తగిన నివేదిక ఇచి్చందంటూ గుంటూరు జిల్లాకు చెందిన మస్తాన్‌ వలి తరఫు న్యాయవాది శ్రీధర్‌రెడ్డి గురువారం సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

కమిటీ నివేదికకు విరుద్ధంగా ఒకే ప్రాంతంలో అభివృద్ధిచేయాలని 2014లో ఏర్పడిన ప్రభుత్వం చూసిందని పేర్కొన్నారు. కేం­ద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటుచేసినప్పటికీ ఇటీవల ఏపీ హైకోర్టు అమరావతి­ని రాజధానిగా అభివృద్ధిచేయాలని ఆదేశించిందని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీక­రణ జరగాలని కమిటీ నివేదిక ఇచ్చిందని.. ఒకే ప్రాంతంతో అభివృద్ధిచేయా­ల­ని చెప్పడం సరికాదన్నారు. రాజధానికి సంబంధించి కమిటీ పలు ప్రాంతాలు సూ­చిం­చినప్పటికీ నాటి ప్రభుత్వం వాటిని విస్మరించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
చదవండి: ఎలాగైనా సరే లోకేశ్‌ పాదయాత్రకు హైప్‌ తేవాలి.. బాబు కుయుక్తులు?  

మరిన్ని వార్తలు