అంతర్వేది నూతన రథం ట్రయల్‌ రన్

24 Jan, 2021 16:34 IST|Sakshi

నూతన రథాన్ని పరిశీలించిన మంత్రి వేణుగోపాల కృష్ణ 

సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయ నూతన రథం ట్రయల్‌‌ రన్‌ను అధికారులు ఆదివారం నిర్వహించారు. రథం బ్రేకులు, జాకీలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తక్కువ సమయంలో నూతన రథాన్ని తయారు చేయించామని తెలిపారు. చదవండి: ‘2018లో చంద్రబాబే పారిపోయారు’

దేవుళ్లు, ఆలయాలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై విచారణను సీబిఐకి అప్పగించామన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికే దేవాలయాల పై ప్రతిపక్షాలు దుష్ట రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి వేణుగోపాల కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: పెన్నాపై మరో కొత్త బ్రిడ్జి: మంత్రి అనిల్‌

మరిన్ని వార్తలు