నవంబర్‌లో ఆకాష్‌ టాలెంట్‌ హంట్‌– 2022

11 Aug, 2022 15:28 IST|Sakshi

లబ్బీపేట (విజయవాడ తూర్పు): దేశ వ్యాప్తంగా దాదాపు రెండు వేల మంది నిరుపేదలు, బాలికలకు ఉచితంగా జేఈఈ, నీట్‌ శిక్షణ ఇచ్చేందుకు నవంబర్‌లో ఆకాష్‌ బైజూస్‌ జాతీయ టాలెంట్‌ హంట్‌ పరీక్ష–2022 (అంతే 2022) నిర్వహించనున్నట్లు ఆ సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ గుదే సంజయ్‌గాంధీ తెలిపారు. ఆ పరీక్షకు సంబంధించి పోస్టర్‌ను ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని ఓ హోటల్‌లో ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా సంజయ్‌గాంధీ మాట్లాడుతూ ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఆల్‌ కార్యక్రమంలో భాగంగా అందించే స్కాలర్‌షిప్‌లకు అదనంగా ఇవి అందించనున్నట్లు తెలిపారు. ఉచిత శిక్షణకు అర్హులను ఎంపిక చేసేందుకు నవంబర్‌ 5 నుంచి 13 వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో ఎంపిక చేసిన తేదీల్లో ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు ఏదైనా సమయంలో ఒక గంట పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆఫ్‌లైన్‌ పరీక్షను ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షలో 90 మార్కులు ఉంటాయని, 35 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఉంటాయన్నారు. దేశ వ్యాప్తంగా 285 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా బిజినెస్‌ హెడ్‌ రవికిరణ్‌ ఏర్పుల, బ్రాంచి మేనేజర్‌ జి.గోపీనాథ్‌లు పాల్గొన్నారు. (క్లిక్: పిల్లల భవిష్యత్తే మనకు ముఖ్యం.. అధికారులతో సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు