గరుడ వాహనంపై విశ్వపతి

2 Oct, 2022 08:38 IST|Sakshi

విశ్వపతి శ్రీ వేంకటేశ్వరుడు శనివారం గరుడ వాహనంపై అంగరంగ వైభవంగా ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ గరుడ వాహన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు.. ఆయన ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. 
– తిరుమల 

దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శనివారం అలంపూర్‌ జోగుళాంబ, బాసర సరస్వతిదేవి, శ్రీశైలం భ్రమరాంబ అమ్మవార్లను కాత్యాయనీదేవిగా అలంకరించి పూజించారు. అలాగే వరంగల్‌ భద్రకాళి.. భవానీదేవిగా దర్శనమిచ్చారు.  
– జోగుళాంబ శక్తిపీఠం(అలంపూర్‌)/బాసర(ముథోల్‌)/హన్మకొండ కల్చరల్‌ 






మరిన్ని వార్తలు