AP: విద్యుత్‌ వినియోగదారులకు శుభవార్త

25 Mar, 2023 15:33 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విద్యుత్‌ వినియోగదారులు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వినియోగదారులపై విద్యుత్‌ భారం పడకుండా చేర్యలు చేపట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్‌ టారిఫ్‌ వివరాలను ఏపీఈఆర్సీ ఛైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జున రెడ్డి ప్రకటించారు. ఈ ఏడాది విద్యుత్‌ వినియోగదారులపై ఎలాంటి భారం ఉండదని వెల్లడించారు.


ఏపీఈఆర్సీ ఛైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జున రెడ్డి

రైతులకు ఉచిత విద్యుత్‌, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల సబ్సిడీ.. నాయి బ్రహ్మణులు, ఆక్వా రంగం విద్యుత్‌ రాయితీలను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. మొత్తం రూ. 10,135 కోట్లు ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. చార్జీలు భరించడానికి ప్రభుత్వం ముందుకు రావడం సంతోషమన్నారు. ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ అంశం మీద మాత్రమే చార్జీలు పెంచుతున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు