టీడీపీ నేతల దాడి: ‘ఇది బ్లాక్‌ డే.. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్‌లోనే’

20 Mar, 2023 10:18 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సభలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. సభ సజావుగా సాగకుండా అడ్డతగిలి.. స్పీకర్‌ పోడియం వద్ద టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తించారు. టీడీపీ నేతలు పేపర్లు చించి స్పీకర్‌పైకి విసరడంతో పాటు ప్లకార్డ్‌ను ఆయనకు అ‍డ్డుగు పెట్టిన సభలో గందరగోళ పరిస్థితికి దారి తీశారు. స్పీకర్‌కు రక్షణగా పోడియం వద్దకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మోహరించగా, ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ సభ్యులపై టీడీపీ నేతల దాడికి దిగారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు దీనిపై స్పందించారు.

డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.  చంద్రబాబు నాయుడు బీసీలకు ఎస్సీలకు గొడవ పెట్టాలని భావిస్తున్నారు.. అందులో భాగంగానే ఎస్సీ ఎమ్మెల్యేలను కావాలని రెచ్చగొట్టి పంపుతున్నారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం అయిన నాపై దుషణకు దిగారు. బాల వీరాంజనేయ స్వామి మాట్లాడితే ఆయనకు మిగిలిన టీడీపీ సభ్యులు మద్దతు పలికారు. ఎవరైతే మద్దతు పలికారు వారందరి పైన అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు.

చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడుతూ.. సభ సజావుగా జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని, చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఈ గలాటా జరిగిందని ధ్వజమెత్తారు. ‘ఈ రోజు మితిమీరిపోయింది.. డోలా వీరాంజనేయులు స్పీకర్ పై దాడి చేశారు, నేను, సుధాకర్‌ బాబు అడ్డుకోవడానికి వెళ్తే మాపైనా దాడి చేశారని’ మండిపడ్డారు. సభాపతిని టీడీపీ అవమానించింది, బీసీ అయిన సభాపతిపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించిన ఆయన టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు.

సుధాకర్ బాబు స్పందిస్తూ.. ఇది బ్లాక్ డే.. స్పీకర్ పై దాడి చేయడానికి ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. టీడీపీ ఎమ్మెల్యే స్పీకరపై దాడి దిగారు.. అడ్డుకోవడానికి వెళ్తే తనపై కూడా దాడి చేశారన్నారు. చంద్రబాబు దిగజారి ప్రవర్తిస్తున్నారని ఫైర్‌ అయ్యారు.


 

మరిన్ని వార్తలు