Ap Assembly Budget 2023-24: ముగిసిన ఐదో రోజు సమావేశాలు.. ఏపీ అసెంబ్లీ ఆదివారానికి వాయిదా

18 Mar, 2023 16:06 IST|Sakshi

Live Updates

Time: 03:00PM
► ఏపీ అసెంబ్లీ ఆదివారానికి వాయిదా పడింది.

►సీఎం వైఎస్‌ జగన్‌ యూత్‌ ఐకాన్‌: మంత్రి రోజా
►జీఐఎస్‌ ద్వారా జగనన్న బ్రాండ్‌ ఏంటో తెలిసింది.
►పరిశ్రమల ద్వారా 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు.
►రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్‌ పట్ల పారిశ్రామికవేత్తలు విశ్వాసంతో ఉన్నారు.
►టీడీపీ నేతల గోబెల్స్‌ ప్రచారాన్ని.. గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌తో తిప్పి కొట్టాం.
►దిగ్గజ పారిశ్రామికవేత్తలంగా ఒకే వేదికపైకి రావడం ఎన్నడూ లేదు.
►జె అంటే జగన్‌. జె అంటే జోష్‌ అని పారిశ్రామికవేత్తలే చెప్పారు.
►జీఐఎస్‌తో సీఎం జగన్‌ ట్రెండ్‌ సెట్టర్‌ అని మరోసారి రుజువు చేశారు.

►రాష్ట్రంలో సీఎం జగన్‌ విప్లవాత్మక మార్పులు తెచ్చారు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
►ఇంధన రంగంలో భారీగా పెట్టుబడులు
►పరిశ్రమల ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి

Time: 02:30PM
ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా.. ఐదోరోజు తాజాగా విశాఖలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా.. జీఐస్‌ ద్వారా రూ. 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఏపీకి వచ్చాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అసెంబ్లీలో వెల్లడించారు. 

పాతికే దేశాల నుంచి ప్రతినిధులు జీఐఎస్‌కు వచ్చారు. ఏపీ ప్రభుత్వ విధానాలపై ప్రశంసలు కురిపించారు. రాష్‌ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించారు. అనేక రంగాల్లో ఎంవోయూలు కుదుర్చుకున్నాం అని ఆయన వెల్లడించారు. రికార్డు వ్యవధిలో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా ఆరు లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. యువతకు ఉపాధి కల్పించే రంగాలపై ప్రధాన దృష్టి సారించినట్లు తెలిపారాయన.

ఇక.. అగ్ర పారిశ్రామికవేత్తలు వస్తే.. ప్రతిపక్షం ఓర్వలేకపోతోంది. అంబానీ, అదానీ ఏపీకి వస్తే టీడీపీ బాధేంటో అర్థం కావట్లేదు. ఏపీకి పెట్టుబడులు రావడం టీడీపీకి ఇష్టం లేదు. సీఎం జగన్‌ బ్రాండ్‌ చూసి ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రంలోని పాలనపై పారిశ్రామికవేత్తలకు విశ్వాసం ఉంది అని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ వెల్లడించారు.    

Time: 02:00PM
►దేశంలోనే మొట్టమొదటిసారిగా మైనారిటీలకు కూడా సబ్‌ ప్లాన్‌ తీసుకువచ్చిన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీనే అని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా తెలిపారు. మైనారిటీ సబ్‌ ప్లాన్‌ కింద రూ.4,203 కోట్లు ఇవాళ బడ్జెట్‌లో కేటాయించామని, గతంలో ఏ ప్రభుత్వం మైనారిటీలకు ఈ స్థాయిలో నిధులు కేటాయించలేదని చెప్పారు.  

►సంక్షేమ శాఖ పద్దులపై జరిగిన చర్చలో మంత్రి అంజాద్‌బాషా మాట్లాడారు. చంద్రబాబు హయాంలోనే మైనారిటీలకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం నడిచిందని మంత్రి గుర్తు చేశారు. మైనారిటీలకు ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. 2019 ఎన్నికలకు మూడు నెలల ముందు ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చి మమ అనిపించారని తెలిపారు. మైనారిటీ ఓట్ల కోసమే ఆ రోజు చంద్రబాబు మూడు నెలల మంత్రి పదవి ఇచ్చి మభ్యపెట్టాలని చూశారని మండిపడ్డారు.  

Time: 12:30PM
►నవరత్నాల పథకాల యాడ్స్‌పై శాసనమండలిలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ క్లారిటీ ఇచ్చారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నవరత్నాల పథకాలు అమలు అవుతున్నాయన్నారు.

►పథకాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలియజేయడానికి యాడ్స్ ఇస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో యాడ్స్ ఇచ్చే వ్యవహారంలో ఎక్కడ వివక్షత లేదని స్పష్టం చేశారు.  ఇప్పటివరకు 128 కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చామని తెలిపారు.

►‘గత తెలుగుదేశం ప్రభుత్వం యాడ్స్ కోసం 449 కోట్లు ఖర్చు చేసింది. యాడ్స్ ఇచ్చే వ్యవహారంలో పారదర్శకత లేదు. ఇష్టానుసారంగా ఎవరికి పడితే వాళ్లకి యాడ్స్ ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధం లేని ఇతర రాష్ట్రాలకు చెందిన పేపర్లకు కూడా యాడ్స్ ఇచ్చారు’ అని తెలిపారు.

Time: 12:00PM

►ఆర్‌ అండ్‌ బీ శాఖ డిమాండ్స్‌ చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 
►రోడ్లను నిర్లక్ష్యం చేసిన చేసిన ఘనత చంద్రబాబుదే.
►కేంద్రం ఇచ్చిన నిధుల్ని కూడా బాబు ఖర్చుచేయలేకపోయారు.
►కేంద్రమిచ్చిన నిధుల కన్నా ఎక్కువ ఖర్చు చేసిన ఘనత జగన్‌ ప్రభుత్వానిది.
►రోడ్ల నిర్వహణపై ఎల్లో మీడియా అసత్య కథనాలు

Time: 11:10AM

శాసనమండలి
►24వ తేదీలోపు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై స్పందిస్తారు: మంత్రి అంబటి రాంబాబు.
►రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై చర్చించేందుకు  సీఎం ఢిల్లీ వెళ్లారు.
►సభకు అంతరాయం కలిగించే విధంగా టీడీపీ ఎమ్మెల్సీలు చేయడం సిగ్గుచేటు 
►చంద్రబాబు డైరెక్షన్లోనే టీడీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారు.

Time: 11:00AM
►ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన అధికారిక పర్యటనే: మంత్రి బొత్స సత్యనారాయణ
►ఇప్పటికిప్పుడు ఢిల్లీ పర్యటనపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి అనటం దారుణం.
​​​​​​►సమాధానం చెప్పకపోతే మేము బాయ్‌కాట్‌ చేస్తామని చెప్పడం సమంజసం కాదు.
►ముందుగానే ప్రిపేర్ అయి వచ్చి బాయ్‌కట్‌ చేస్తామని చెప్తున్నారు.

Time: 10:10AM
►ప్రతిపక్షానిది బాధ్యతా రాహిత్యం.. నాది బాధ్యత: స్పీకర్‌ తమ్మినేని

►సభను సజావుగా నడిపించాల్సిన బాధ్యత నాపై ఉంది.
►చరిత్రలో కళంకితుడిగా ఉండాలనుకోవట్లేదు.
►సభా నాయకుడు నాకు గొప్ప బాధ్యత అప్పగించారు.
►ఆ బాధ్యతల మేరకే సహనంగా ఉంటున్నా.

Time: 09:50AM
►సభా కార్యకలాపాలను పదేపదే అడ్డుకున్న టీడీపీ. 
►స్పీకర్‌పై పేపర్లు చింపి విసిరేసిన టీడీపీ సభ్యులు.
►అసెంబ్లీ నుంచి ఒకరోజు పాటు టీడీపీ సభ్యుల సస్పెండ్‌.

► ఉద్దానం ప్రాంత‌ ప్రజలకు, భావితరాలకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఉద్దానం ప్రజలకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలనే తపన, చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి సీఎం జగన్‌ పనిచేస్తున్నారని, రూ.742 కోట్ల వ్యయంతో 100 కిలోమీటర్ల తాగునీటి పైపులైన్‌ నిర్మిస్తున్నామన్నారు.

►జూన్‌లో పైపులైన్‌ నిర్మాణ పనులు పూర్తవుతాయని, ఆ ప్రాంతానికి సురక్షితమైన తాగునీరు అందుతుందని చెప్పారు. ఉద్దానం ప్రాంత ప్రజలకు ఇబ్బందిలేకుండా రానున్న కాలంలో పలాస డయాలసిస్‌ యూనిట్‌ 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని రూ.50 కోట్లతో నిర్మించనున్నామన్నారు. ఆ ఆస్పత్రిలో 151 మంది మెడికల్‌ స్టాఫ్‌ను అందుబాటులో ఉంచి ఉద్దానం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించబోతున్నామని చెప్పారు.  

Time: 09:30AM
►సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించారని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అ‍న్నారు. విభజన వల్ల పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చించారని తెలిపారు. పోలవరం నిధులపై ప్రధానితో సీఎం చర్చించారని పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు గత ఢిల్లీ పర్యటనలపై చర్చిద్దామా? టీడీపీ హయాంలో పోలవరంలో జరిగిన తప్పులపై చర్చిద్దామా?. చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు, పెట్టిన బకాయిలపై చర్చిద్దామా?’’ అంటూ మంత్రి బుగ్గన సవాల్‌ విసిరారు.

Time: 09:15AM
►అసెంబ్లీలో టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
► సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలంటూ నిరసన
►టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాక్షి, అమరావతి: అయిదో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. అనంతరం గ్లోబల్ ఇన్వెస్టెమెంట్‌ సమ్మిట్, యువత స్కిల్ డెవలప్‌మెంట్‌ శిక్షణపై చర్చ జరగనుంది. అటు శాసనమండలిలో ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్‌పై చర్చ జరగనుంది.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు