పరిటాల, పయ్యావుల, ధూళిపాళ్ల, కంభంపాటి సహా చాలా మంది టీడీపీ నేతలు..

15 Sep, 2022 15:06 IST|Sakshi

సాక్షి, అమరావతి: శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను చంద్రబాబు పూర్తిగా పక్కపెట్టేశారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్నారు. అక్కడ టీడీపీ నేతలు భూములు కొన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కొంతమంది చేతుల్లోనే పదివేల ఎకరాల అమరావతి భూములు ఉన్నాయని తెలిపారు. పరిటాల, పయ్యావుల, ధూళిపాళ్ల, కంభంపాటి సహా చాలా మంది టీడీపీ నేతలు భూములు సేకరించారని పేర్కొన్నారు.

హెరిటేజ్‌ ఫుడ్స్‌ కూడా 14 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందని వెల్లడించారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తే అప్పటి ప్రభుత్వం తిరస్కరించిందని వ్యాఖ్యానించారు. అమరావతిలోవి తాత్కాలిక నిర్మాణాలు.. వేల ఎకరాల భూములు కొంతమంది చేతుల్లోనే ఉన్నాయన్నారు. టీడీపీ అంటేనే టెంపరరీ డెవలప్‌మెంట్‌ పార్టీ అని, అమరావతిలో టీడీపీ నేతలు భూములు కొన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. దళితులను భయపెట్టి అసైన్డ్‌ భూములను లాక్కున్నారని మండిపడ్డారు.

కొందరి ఆస్తి విలువ పేంచేందుకు రాష్ట్ర మొత్తం పన్ను కట్టాలా? అని నిలదీశారు. అమరావతిలోఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని మంత్రి బుగ్గన అన్నారు. బిల్డింగులు కడితే పరిపాలన సాగుతుందా అని ప్రశ్నించారు. రాజధాని ప్రకటనకు ముందే అమరావతిలో భూముల కొనుగోలు జరిగిందన్నారు. రియల్‌ ఎస్టేట్‌ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. పాదయాత్రలో స్థానికులు లేరని, రియల్‌ ఎస్టేట్‌ బ్యాచ్‌ చేస్తున్న పాదయాత్ర ఇదని ధ్వజమెత్తారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలనేదే సీఎం జగన్‌ ఆకాంక్ష అని తెలిపారు.

చదవండి: (అశ్వనీదత్‌, రాఘవేంద్రరావు కోరుకున్న చోట భూములు: కొడాలి నాని)

మరిన్ని వార్తలు