మూడు బిల్లులకు అసెంబ‍్లీ ఆమోదం

20 Sep, 2022 08:27 IST|Sakshi

సాక్షి, అమరావతి: శాసనసభ సోమవారం మూడు బిల్లులను ఆమోదించింది. కార్పొరేట్, ఇతర పెద్ద కంపెనీలు రాష్ట్రంలో తమ ఫ్రాంచైజీలు, డీలర్లకు లైసెన్సు ఇచ్చేటప్పుడు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులకు సంబంధించిన భారత (ఏపీ) స్టాంపు చట్ట సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది నియామకంలో ఏకరూపత ఉండేలా సంబంధిత కమిటీల్లో ఉన్నత విద్య, ఆర్థిక శాఖాధికారులను నియమించేందుకు ఉద్దేశించిన ఏపీ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లును, క్యాంపస్‌ల వారీగా ఉన్న నియామక ప్రక్రియ, రోస్టర్‌ నిర్ణయాన్ని యూనివర్సిటీ ప్రాతిపదికగా చేసే అధికారాన్ని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయానికి దఖలుపరిచే సవరణ బిల్లును సభ ఆమోదించింది. కాగా, మరో ఐదు బిల్లులను మంత్రులు సభలో ప్రవేశపెట్టారు. ఏపీ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ చట్ట సవరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రవేశపెట్టారు. ఏపీ సర్వే, సరిహద్దుల చట్ట సవరణ బిల్లు, ఏపీ భూమి హక్కులు, పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల చట్ట సవరణ బిల్లు, ఏపీ కౌలుదారీ (ఆంధ్ర ప్రాంత) రద్దు చట్ట సవరణ బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఏపీ కో–ఆపరేటివ్‌ సొసైటీల చట్ట సవరణ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రవేశపెట్టారు.   

మండలిలో నాలుగు బిల్లులు ఆమోదం 
అసెంబ్లీలో ఆమోదించిన నాలుగు బిల్లులను శాసన మండలిలో సభ్యులు ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ రాజ్‌ (సవరణ) బిల్లు–2022, ఆంధ్రప్రదేశ్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (సవరణ) బిల్లు–2022, ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సరీ్వసెస్‌ (డిసిప్లినరీ ప్రొసీడింగ్స్‌ ట్రిబ్యునల్‌) (రద్దు) బిల్లు–2022, ఆంధ్రప్రదేశ్‌ (వ్యవసాయ ఉత్పత్తి, పశువుల) మార్కెట్లు (సవరణ) బిల్లు–2022లను మండలి ఆమోదించింది.

ఇదీ చదవండి: ఏపీ అసెంబ్లీకి ఫోన్‌ ట్యాపింగ్‌ హౌస్‌ కమిటీ నివేదిక

మరిన్ని వార్తలు