ఏపీ అసెంబ్లీ సమావేశాలు: నాలుగవ రోజు అప్‌డేట్స్‌

20 Sep, 2022 14:51 IST|Sakshi

ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నాలుగో రోజు అప్‌డేట్స్‌

02:15
ప్రపంచంలో విద్యావవస్థ వేగంగా మారుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విద్యారంగంలో నాడు-నేడుపై అసెంబ్లీలో సీఎం జగన్‌ ప్రసంగిస్తూ.. ఏపీలో విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టామన్నారు. రాజకీయ దుర్బుద్దితో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ప్రభుత్వ బడులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చాకా ఎలా ఉన్నాయనేది పరిశీలించాలని తెలిపారు.

‘గతంలో కార్పొరేట్‌ స్కూళ్లకు మేలు కలిగించేలా విధానాలు ఉండేవి. డ్రాప్‌ ఔట్‌ రేట్‌ పెరుగుతున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మేం వచ్చాక విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టాం. కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం. మానవ వనరులపై పెట్టుబడి పెడుతున్నాం. చంద్రబాబు సొంతూరు నారావారి పల్లెలోనూ స్కూళ్లను పట్టించుకోలేదు. కుప్పంలో స్కూళ్లు దీనావస్థలో ఉండేవి. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశాం. మనబడి నాడు-నేడు ద్వారా 57వేల స్కూళ్లు, హాస్టళ్లు అభివృద్ధికి రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఉన్నత విద్యను హక్కుగా మార్చాం​’ అని వ్యాఖ్యానించారు.

1:32PM
విద్యారంగంలో సీఎం జగన్‌ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. గత ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేసింది. చైతన్య, నారాయణ సంస్థలకు విద్యా రంగాన్ని ధారాదత్తం చేశారు: సుధాకర్‌బాబు

12:39PM
టీడీపీకి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదు. ఎన్నికల ముందు మాత్రమే చంద్రబాబుకు పథకాలు గుర్తొస్తాయి: ఆదిమూలపు సురేష్‌

12:34PM
టీడీపీ సంక్షోభంలో ఉన్న పార్టీ. సభను అడ్డుకునేందుకు టీడపీ సభ్యులు వస్తున్నారు.సమస్యలపై చర్చించాలన్న ఆలోచన కూడా టీడీపీకి లేదు: జోగి రమేష్‌

12:30PM
►స్పీకర్‌ పోడియం వద్ద టీడీపీ సభ్యుల హంగామా
►సభను అడ్డుకునేందుకు టీడీపీ సభ్యుల ప్రయత్నం
►ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌
►టీడీపీ సభ్యులపై ఒక రోజు సస్పెన్షన్‌

12:16PM

►రుణమాఫీ పేరుతో చంద్రబాబు మోసం చేశారు. సంక్షేమంలో సీఎం జగన్‌ను విమర్శించే అర్హత టీడీపీకి లేదు. సంక్షేమ పథకాలు అమలుపై దమ్ముంటే చర్చకు రండి: కన్నబాబు

11:56AM

► డేటా చోరీపై హౌస్‌ కమిటీ నివేదిక.  డేటా చోరీపై మధ్యంతర నివేదికను సభలో ప్రవేశపెట్టారు భూమన కరుణాకర్‌ రెడ్డి.

► డేటా చోరీ జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. గత ప్రభుత్వం హయాంలో డేటా చోరీ జరిగింది.  30 లక్షలకుపైగా ఓటర్ల తొలగింపులో భాగంగానే డేటా చోరీ. సేవా మిత్ర యాప్‌ ద్వారా 30 లక్షల ఓట్లు తొలగించే ప్రయత్నం చేశారు.  టీడీపీ సేవామిత్ర యాప్‌ను దుర్వినియోగం చేసింది. దీనిపై మరింత లోతుగా విచారణ జరగాలి: భూమన

9:18AM
విష జ్వరాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకున్నాం.  వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. విష జ్వరాల నియంత్రణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించాం. డెంగ్యూ, మలేరియాను ఆరోగ్య శ్రీలో చేర్చాం.  ఆరోగ్య శ్రీ పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. గత ప్రభుత్వం దోమలపై దండయాత్ర పేరుతో డబ్బులు దుబారా చేశారు. చిన్నారి సంధ్య మృతి ఘటన బాధాకరం.  వైరల్‌ డిసీజ్‌తో చిన్నారి మృతి.  చిన్నారి మృతిని టీడీపీ సభ్యులు రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. :  మంత్రి విడదల రజనీ

9:00AM
►ప్రారంభమైన నాల్గోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

08:45AM
► ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. నేడు ఏడు బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. 

► ఏపీ అసెంబ్లీలో ఇవాళ(మంగళవారం).. విద్యావైద్యం, నాడు-నేడుపై స్వల్పకాలిక చర్చ కొనసాగనుంది. 

08:30AM
► ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. నేడు శాసనసభ ముందుకు పెగాసెస్‌ నివేదిక రానుంది. 85 పేజీల ఆధారాలతో సభ ముందు నివేదిక పెట్టనుంది హౌజ్‌ కమిటీ. టీడీపీ హయాంలో డేటా చౌర్యం జరిగినట్లు ఆరోపణలున్నాయి.

మరిన్ని వార్తలు