స్టీల్‌ప్లాంట్‌ సెంటిమెంట్‌ వివరించాం: సోము

15 Feb, 2021 16:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నేతల సమావేశం ముగిసింది. సుమారు అరగంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది.  అనంతరం భేటీ వివరాలను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వివరించారు.  స్టీల్ ప్లాంట్‌పై ప్రజల సెంటిమెంటును కేంద్రమంత్రికి వివరించామన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ప్రత్యామ్నాయాలు చూడాలని కోరామన్నారు. బ్యాంకుల విలీనం తరహాలోనే, వేరే ప్రభుత్వ రంగ సంస్థలలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. అందరి ప్రయోజనాలు కాపాడాలని కోరినట్లు సోము తెలిపారు. అయితే ఏపీ నేతలతో భేటీ అనంతరం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

కాగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకారణ చేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. కేంద్ర నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సైతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

మరిన్ని వార్తలు