బీజేపీలో తీవ్ర విషాదం.. లోకుల గాంధీ కన్నుమూత

21 Aug, 2021 09:35 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ భారతీయ జనతా పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ కన్నుమూశారు. కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న లోకుల గాంధీ చికిత్స నిమ్మితం విశాఖ కేజీహెచ్‌లో చేరారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం మృతి చెందారు. లోకుల గాంధీ మృతి పట్ల ఏపీ బీజేపీ అధక్షుడు సోము వీర్రాజు సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందించారు.

మరిన్ని వార్తలు