అమరావతి పాదయాత్రకు బ్రేక్.. తాత్కాలిక విరామం!

22 Oct, 2022 10:31 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, కోనసీమ: అమరావతి పేరిట చేపట్టిన పాదయాత్రకు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బ్రేకులు పడ్డాయి. శనివారం ఉదయం రామచంద్రాపురం వద్ద అమరావతి యాత్ర నిలిచిపోయింది.

హైకోర్టు ఆదేశాల మేరకు యాత్రలో పాల్గొన్న వారు.. గుర్తింపు కార్డులు ధరించి యాత్ర చేసుకోవాలని పోలీసులు సూచించారు. అయితే గుర్తింపు కార్డులు చూపించని నేపథ్యంలో యాత్ర నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో.. నాలుగు రోజులపాటు పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇవ్వాలనే నిర్ణయానికి యాత్రికులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అమరావతి పాదయాత్ర విషయంలో ఏపీ హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

పాదయాత్రలో కేవలం 600 మంది మాత్రమే ఉండాలని, డీజీపీకి అందచేసిన జాబితాలో ఉన్న వ్యక్తులే పాల్గొనాలని స్పష్టం చేసింది. పాదయాత్రకు సంఘీభావం తెలపాలనుకునే వ్యక్తులు ఇరువైపులా ఉండి మద్దతు తెలపవచ్చని, అయితే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్రలో పాల్గొనడానికి వీల్లేదని ఆదేశించింది. ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీనివల్ల అసాంఘిక శక్తులతో శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారంటూ పిటిషనర్లు వ్యక్తం చేస్తున్న ఆందోళన తొలగిపోతుందని పేర్కొంది.

మరిన్ని వార్తలు