AP Budget 2021: మహిళలే మహరాణులు

21 May, 2021 05:08 IST|Sakshi

మహిళా సాధికారత దిశగా ముందడుగు

బాలికలు, మహిళలకు ప్రత్యేక బడ్జెట్‌ 

53 పథకాల కింద రూ.47,283.21 కోట్లు కేటాయింపు 

సాక్షి, అమరావతి: మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. మహిళలు ఆర్థిక, సామాజిక స్వావలంబన సాధించే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్‌ కొత్త అధ్యయానికి నాంది పలికారు. బడ్జెట్‌లో సింహభాగం నిధులను రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం కేటాయించింది. మహిళల అభ్యుదయానికి వివిధ పథకాల ద్వారా కేటాయిస్తున్న నిధుల వివరాలతో ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. 2021–22  బడ్జెట్‌లో మహిళలకు రూ. 47,283.21కోట్లు కేటాయించింది.  శాఖల వారీగా కేటాయింపులను ఆ నివేదికలో పొందుపరిచింది.

రెండు విభాగాలు.. 53 పథకాలు
మొత్తం 53 పథకాల కింద బాలికలు, మహిళలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. వాటిని రెండు విభాగాలుగా నివేదిక రూపంలో వెలువరించారు. 

  • 100 శాతం నిధులను బాలికలు, మహిళలకు కేటాయించే పథకాల వివరాలను మొదటి విభాగంలో పొందుపరిచారు. అందులో 24 పథకాలు ఉన్నాయి. వాటికి మొత్తం రూ.23,463.10 కోట్లు కేటాయించారు. 
  • బాలికలు, మహిళలకు 30 శాతం నుంచి 99 శాతం వరకు నిధుల కేటాయించిన పథకాలను రెండో విభాగంలో పొందుపరిచారు. అందులో 29 పథకాలు ఉన్నాయి. వాటికి మొత్తం రూ.23,820.11 కోట్లు కేటాయించారు. 

గ్రామీణాభివృద్ధి శాఖదే అగ్రస్థానం
బాలికలు, మహిళలకు నిధుల కేటాయింపులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మొదటి స్థానం సాధించింది. ఆ శాఖ రూ.13,072.27 కోట్లు కేటాయించడం విశేషం. రూ.6,337.44 కోట్ల కేటాయింపులతో వైఎస్సార్‌ ఆసరా రెండో స్థానంలో నిలిచింది. జగనన్న అమ్మ ఒడి పథకం రూ.6,107.36 కోట్ల కేటాయింపులతో మూడో స్థానంలో ఉంది. 
 

మరిన్ని వార్తలు