ఏపీ వార్షిక బడ్జెట్.. సంక్షేమ పథకాలకు పెద్దపీట

16 Mar, 2023 10:49 IST|Sakshi

సాక్షి, అమరావాతి: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రవేశపెట్టిన ఏపీ వార్షిక బడ్జెట్‌ రూ. రూ. 2లక్షల 79వేల 279 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు. మూలధన వ్యయం రూ.31,061కోట్లు. బడ్జెట్‌లో  సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వ కేటాయింపులు ఇలా ఉన్నాయి..

వైఎస్సార్ పెన్షన్‌ కానుక రూ.21,434.72 కోట్లు

వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రూ.15,882 కోట్లు

వైఎస్సార్‌ రైతు భరోసా రూ.4,020 కోట్లు

జగనన్న విద్యా దీవెన రూ.2,841.64 కోట్లు

జగనన్న వసతి దీవెన రూ.2,200 కోట్లు

వైఎస్సార్-పీఎం బీమా యోజన రూ.1600 కోట్లు

డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రూణాల కోసం రూ.1000 కోట్లు

రైతులకు వడ్డీ లేని రుణాలు రూ.500 కోట్లు

వైఎస్సార్ కాపు నేస్తం రూ.550 కోట్లు

జగనన్న చేదోడు రూ.35 0 కోట్లు

వైఎస్సార్ వాహనమిత్ర రూ.275 కోట్లు

వైఎస్సార్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు

వైఎస్సార్ మత్స్యకారు భరోసా రూ.125కోట్లు

మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.50కోట్లు

రైతు కుటుంబాల పరిహారం కోసం రూ.20 కోట్లు

లా నేస్తం రూ.17 కోట్లు

 జగనన్న తోడు రూ.35 కోట్లు

ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు

వైఎస్సార్ కల్యాణమస్తు రూ.200 కోట్లు

వైఎస్సార్ ఆసరా రూ.6,700 కోట్లు

వైఎస్సార్ చేయూత రూ.5, 000 కోట్లు

అమ్మఒడి రూ.6,500 కోట్లు

జగనన్న విద్యా కానుక రూ.560  కోట్లు

మరిన్ని వార్తలు