భయపెట్టి ఆడే గుండెను ఆపేయకండి: సీఎం జగన్‌

20 May, 2021 16:50 IST|Sakshi

సాక్షి, అమరావతి :  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎల్లో మీడియా చేస్తున్న అసత్య ప్రచారంపై అసహనం వ్యక్తం చేశారు. భయాలు, అపోహలతో ఆడే గుండెలను ఆపకండంటూ ఆవేదన చెందారు. గురువారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. కోవిడ్‌ విజృంభిస్తున్న సమయంలో చిన్నచిన్న తప్పులు జరిగినా ఒకరినొకరు కలుపుకుని పోవాలని అన్నారు. ప్రజల మనోధైర్యాలను దెబ్బతీసే వార్తలు, అసత్యాలను ప్రచారం చేయొద్దని ఎల్లో మీడియాకు విజ్ఞప్తి చేశారు.

మహమ్మారి కరోనాపై పోరు గురించి సీఎం జగన్‌ మాట్లాడుతూ... ‘‘కోవిడ్‌ రోగుల కోసం 47 వేల బెడ్లను అందుబాటులోకి తీసుకొచ్చాం . కోవిడ్‌ కేర్‌ సెంటర్లలోనూ 52 వేల బెడ్లను అందుబాటులోకి తెచ్చాం.18 వేల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను అందుబాటులోకి తెస్తున్నాం. కోవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందిస్తున్నాం. గడిచిన 14 నెలల్లో కోవిడ్‌ నియంత్రణకు రూ.2,229 కోట్లు కేటాయించాం. కోవిడ్‌ సమాచారం కోసం 104ను అందుబాటులోకి తెచ్చాం. ఇప్పటివరకు 3.12 లక్షలమంది 104 సేవలు వినియోగించుకున్నారు. 104 ద్వారా 60 వేలమందికిపైగా కోవిడ్‌ రోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు ఏర్పాటు చేశాం. టెలీమెడిసిన్ ద్వారా 3,991 మంది వైద్యులు సేవలు అందిస్తున్నారు. విదేశాల నుంచి ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు.

చదవండి: నాకు ప్రాణం విలువ బాగా తెలుసు: సీఎం జగన్‌

>
మరిన్ని వార్తలు