కచ్చితంగా ప్రతీ ఇంటికి మంత్రి, ఎమ్మెల్యే వెళ్లాల్సిందే: సీఎం జగన్‌

12 May, 2022 15:12 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ‍్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ భేటీ ముగిసింది. కేబినెట్ భేటీ అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై విస్తృతంగా చర్చ జరిగింది. 

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రజలకు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరించాలని ఆదేశించారు. అలాగే.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కచ్చితంగా ప్రతీ ఇంటికి మంత్రి, ఎమ్మెల్యే వెళ్లాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను వివరిస్తే తక్షణమే పరిష‍్కరించాలని స్పష్టం చేశారు. 
 

ఇది కూడా చదవండి: ప్రాణాలను సైతం లెక్కచేయని సేవామూర్తులకు శుభాకాంక్షలు: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు