ఏపీ ‘పవర్‌’ఫుల్‌.. పెరిగిన తలసరి విద్యుత్‌

5 Mar, 2023 09:47 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో మెరుగైన విద్యుత్‌ వ్యవస్థ

క్లిష్ట పరిస్థితుల్లోనూ వినియోగదారులకు నిరంతర సరఫరా

ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఆదర్శంగా నిలుస్తున్న డిస్కంలు

2018లో తలసరి విద్యుత్‌ లభ్యత 1,180.3 యూనిట్లు మాత్రమే

రాష్ట్రంలో పెరిగిన తలసరి విద్యుత్‌

2022లో ఒక్కొక్కరికి అందుబాటులో 1,378.6 యూనిట్లు 

ఏ రాష్ట్రంలో అయినా పౌరులకు సరిపడినంత స్థాయిలో విద్యుత్‌ అందుబాటులో ఉందంటే ఆ రాష్ట్రంలో ఉత్పాదకత, జీవన ప్రమాణాలు మెరుగైన స్థితిలో ఉన్నాయని అర్థం. ఆర్థిక అభివృద్ధికి విద్యుత్‌ వినియోగాన్ని సైతం ప్రామాణికంగా తీసుకుంటారు. అలాంటి అత్యుత్తమ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని మరోసారి రుజువైంది. రాష్ట్రంలో తలసరి విద్యుత్‌ లభ్యత పెరుగుదలే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. 2018లో తలసరి విద్యుత్‌ లభ్యత 1,180.3 యూనిట్లు మాత్రమే ఉండగా.. ఇప్పుడది 1,378.6 యూనిట్లకు పెరిగింది. మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్థలకు ఇస్తున్న ప్రోత్సాహం, బలపడుతున్న విద్యుత్‌ వ్యవస్థల కారణంగానే ఇది సాధ్యమైంది.

సాక్షి, అమరావతి: వినియోగదా­రులకు అత్యధిక విద్యుత్‌ను అందు­బా­టులో ఉంచేందుకు ఏపీ ట్రాన్స్‌కో మె­రుగైన నెట్‌వర్క్‌ మెయింటెనెన్స్, మాని­­టరింగ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ను సులభతరం చేసే దిశగా చర్యలు చేపట్టింది. జియోగ్రాఫికల్‌ ఇన్ఫ­ర్మేషన్‌ సిస్టమ్‌ (జీఐఎస్‌) అంతర్గత డిమాండ్‌ అం­చనా నమూనాను అభివృద్ధి చేసింది. ఏపీ స్టేట్‌ లోడ్‌ డి­స్పాచ్‌ సెంటర్‌ (ఏపీ ఎస్‌ఎల్‌డీసీ) ఆర్టిఫి­షి­యల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్‌ పద్ధతులను ఉప­­యోగించి మరింత అధునాతన అంతర్గత ఎనర్జీ ఫోర్‌ కాస్టింగ్‌ మోడల్‌ను అభివృద్ధి చేసింది. 

తద్వారా ఎప్పటికప్పుడు అవసరమైన విద్యుత్‌ను కొనుగో­లు చేయగలుగుతోంది. మరోవైపు పంపిణీ వ్యవస్థను డిస్కంలు మెరుగుపరుచుకుంటున్నాయి. దీంతో 2018–19లో 16.36 శాతంగా ఉన్న యాగ్రి­గేట్‌ టెక్నికల్, కమర్షియల్‌ (ఏటీసీ) నష్టాలు 2021–22­లో 11.21 శాతానికి తగ్గాయి. 5.15 శాతం తగ్గుద­లతో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఆం­ధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థలు దేశంలోనే అత్యుత్తమమని రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ)  ప్రకటించింది.

మున్ముందు మరింత మెరుగ్గా..
రాష్ట్రంలోని 1.92 కోట్ల వినియోగదారులకు విద్యుత్‌ సరఫరా చేస్తున్న మూడు డిస్కంలు ‘కన్సూ్యమర్‌ సర్వీస్‌ రేటింగ్‌ ఆఫ్‌ డిస్కమ్స్‌’ నివేదికలో ఇప్పటికే  ‘ఏ’ గ్రేడ్‌ సాధించాయి. రానున్న రోజుల్లో సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ‘లాస్‌ డిడక్షన్‌ వర్క్స్‌’ పేరుతో ఏపీ ఈపీడీసీఎల్‌లో రూ.­2,617.54 కోట్లు, ఏపీ సీపీడీసీఎల్‌లో రూ.1,498.5 కోట్లు, ఏపీ ఎస్పీడీసీఎల్‌లో రూ.5,160.64 కోట్లు వెచ్చించాలని భావిస్తున్నాయి. విద్యుత్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు దానివల్ల ప్రజలు, విద్యుత్‌ సిబ్బంది ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు కూడా విద్యుత్‌ సంస్థలు చర్యలు చేపడుతున్నాయి. భద్రతా చర్యలలో భాగంగా స్ప్రింగ్‌ చార్జ్‌ బ్రేకర్స్‌ స్థానంలో సాంకేతికంగా మెరుగైన ‘ఫాస్ట్‌ యాక్టింగ్‌ పర్మినెంట్‌ మాగ్నెట్‌ యా­క్యు­­యేటర్‌’ మెకా­నిజం టైప్‌ వాక్యూ­మ్‌ సర్క్యూట్‌ బ్రేకర్లతో భర్తీ చేయాలని డిస్కంలు ఇప్పటికే ప్రతిపాదించాయి.

ప్రభుత్వ ప్రోత్సాహం
గడచిన మూడేళ్లలో డిస్కంలకు ప్రభుత్వం రూ.40 వేల కోట్లకుపైగా ఆర్థిక సాయం అందించింది. దీంతో విద్యుత్‌ సరఫరా వ్యవస్థను అభివృద్ధి పరుచుకుంటున్నాం. మౌలిక సదుపాయాలు కల్పించుకుంటున్నాం. ఆధునిక సాంకేతికతతో విని­యోగదారులకు అధిక విద్యుత్‌ను అందుబాటులో ఉంచుతున్నాం.    
– కె.సంతోషరావు, సీఎండీ, ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్‌

మనమే ఆదర్శం
విద్యుత్‌ కొరత ఏర్పడితే బహిరంగ మార్కెట్‌ నుంచి అత్యధిక ధరకు కొనైనా సరే వినియోగదారులకు అందించేందుకు ప్రభుత్వమే ఆర్థికంగా చేయూతనిస్తోంది. మెరుగైన విద్యుత్‌ సరఫరా కోసం అత్యాధునిక సబ్‌స్టేషన్లు నిర్మిస్తున్నాం. విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ, మరమ్మతులను తరచుగా నిర్వహిస్తున్నాం.
– జె.పద్మాజనార్దనరెడ్డి, సీఎండీ, ఏపీ సీపీడీసీఎల్‌

మరిన్ని వార్తలు