ఏపీ: ట్రాఫిక్‌ ఆర్‌ఎస్‌ఐకు అరుదైన గౌరవం

24 Jun, 2021 21:03 IST|Sakshi

ట్రాఫిక్‌ ఆర్‌ఎస్‌ఐ అర్జున్‌రావుకు "ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శౌర్య పతకం"

సాక్షి, అమరావతి: మహిళ ప్రాణాలు రక్షించిన ట్రాఫిక్‌ ఆర్‌ఎస్‌ఐ అర్జున్‌రావుకు అరుదైన గౌరవం దక్కింది. "ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శౌర్య పతకం" ప్రభుత్వం ప్రకటించింది.

ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌
ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన "దిశ"పై ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని ఆదేశించారు. "దిశ"పై మహిళా పోలీసులకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ దిశానిర్దేశం చేశారు. ఇంటింటికి వెళ్లి మహిళల ఫోన్లలో దిశయాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని డీజీపీ ఆదేశించారు.

చదవండి: ఏపీలో టెన్త్‌, ఇంటర్ పరీక్షలు రద్దు
ఏపీ మరో కీలక నిర్ణయం: వారిక మహిళా పోలీసులు

మరిన్ని వార్తలు